చుల్ బుల్ పాండేజీ కో ఫీర్సే స్వాగత్ కరో… #HudHudDabangg

బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దబాంగ్ 3. 2010లో వచ్చిన దబాంగ్ సినిమా సిరీస్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిఫరెంట్ క్యారెక్టర్, ఫన్నీ డైలాగ్స్, ఆకట్టుకునే మేనరిజమ్స్ తో మోస్ట్ ఎంటర్టైనింగ్ కాప్ గా పేరు తెచ్చుకున్న చుల్ బుల్ పాండేకి ఒక ట్రేడ్ మార్క్ సాంగ్ ఉంది.

#HudHudDabangg అంటూ సాగే పాట ఫస్ట్ సినిమా నుంచి చాలా ఫేమస్, ఈ టైటిల్ ట్రాక్ లో సల్మాన్ బెల్ట్ స్టెప్ సిగ్నేచర్ మూవ్మెంట్ గా నిలిచింది. ఇప్పటికీ దబాంగ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాలర్ కి తగిలించిన కళ్లద్దాలు, ఈ బెల్ట్ స్టెప్. ఇప్పుడు ఈ బెల్ట్ స్టెప్ ని లేకుండా చేసిన ప్రభు దేవా, తన మార్క్ కొరియోగ్రఫీ టచ్ ఇస్తూ కొత్త #HudHudDabangg సాంగ్ ని రెడీ చేశాడు. ప్రొమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన ఈ #HudHudDabangg లేటెస్ట్ ఎడిషన్ బయటకి వచ్చిన కాసేపటికే ట్రెండ్ అవుతోంది.