జీవిత రహస్యాలను బయటపెట్టనున్న ప్రియాంక చోప్రా

ఒక చిన్న మోడల్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో దాదాపు స్టార్ హిరోలందరితో జత కట్టిన ప్రియాంక ఆ తరువాత హాలీవుడ్ కి కూడా వెళ్లింది. అనంతరం తనకంటే చిన్నవాడైనా అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లాడింది. చాలా వరకు పీ సీ (ప్రియాంక చోప్రా) జీవితానికి సంబంధించిన విషయాలన్నీ చాలా మందికి తెలుసు.

అయితే తెలియని విషయాలను కూడా ఈ బ్యూటీ ఒక పుస్తకం ద్వారా బయటపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఈ బాలీవుడ్ బ్యూటీ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చింది. అన్ ఫీనిషిడ్ ఈజ్ ఫీనిషిడ్.. అంటూ ఇంకా పూర్తికాలేనిది పూర్తయ్యిందని ట్వీట్ చేసింది. త్వరలోనే చాలా విషయాలను మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా జ్ఞాపకాలలోని ప్రతి పదం ఆత్మపరిశీలన మరియు ప్రతిబింబించే ప్రదేశం నుండి నా జీవితంలోకి వస్తుందని అంటూ ప్రియాంక వివరణ ఇచ్చింది.