బెంగాల్ టైగర్ బయోపిక్… స్టార్ హీరో కష్టపడక తప్పదు

గత కొంతకాలంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా నడుస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ జానర్ లో వచ్చే బయోపిక్స్ కి మంచి మార్కెట్ ఉంది, ధోని సినిమా దిన్ని సాలిడ్ గా ప్రూవ్ చేసింది. ఈ లిస్ట్ లో చేరుతూ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కించాలని బాలీవుడ్ లో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇండియన్ టీంకి వేగం నేర్పించి, యువ రక్తం అందించిన మోస్ట్ సక్సస్ ఫుల్ కెప్టెన్ గంగూలీ బయోపిక్ లో స్టార్ హీరో హ్రితిక్ నటిస్తున్నాడనే వార్త అక్కడి మీడియాలో బాగానే వినిపించింది కానీ అఫీషియల్ గా మాత్రమే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

నేహా టాక్ షోలో తన బయోపిక్ గురించి మాట్లాడిన సౌరవ్ గంగూలీ, “నా బయోపిక్ లో నటించే హీరో కనిపించలేద”ని చెప్పాడు. దానికి నేహా, హ్రితిక్ రోషన్ అయితే బాగుంటుందేమో అనడంతో… గంగూలీ, హ్రితిక్ అయితే బాగానే ఉంటుందని. అయితే హ్రితిక్ తన బయోపిక్ లో నటించాలి అంటే ఫిజిక్ పై చాలా వర్క్ చేయాల్సి వస్తుందని చెప్పాడు. యూత్ అంతా హ్రితిక్ రోషన్ లాంటి బాడీ కావాలనుకుంటారు కానీ, నా బయోపిక్ లో నటించాలి అంటే హ్రితిక్ నా లాంటి బాడీ తెచ్చుకోవాలంటూ గంగూలీ సరదాగా మాట్లాడాడు. కథ నచ్చితే బరువు పెరగడానికైనా, తగ్గడానికి హ్రితిక్ రోషన్ ముందుంటాడు కాబట్టి అన్నీ సెట్ అయితే ఈ బయోపిక్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి.