హాలీవుడ్ స్పై థ్రిల్లర్ లో ఇండియన్ హీరో

బాలీవుడ్ హృతిక్ రోషన్ భారతీయ సినిమా స్టైలిష్ నటులలో ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్న వార్ తో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. తన నటనతో ఈ నటుడు అభిమానులను మరింత థ్రిల్ చేశాడు. తాజా ఊహాగానాల ప్రకారం హృతిక్ రోషన్ త్వరలో హాలీవుడ్ స్పై థ్రిల్లర్‌లో కనిపించనున్నారని టాక్. బాలీవుడ్ వర్గాల నుండి వస్తున్న నివేదికల ప్రకారం ఈ నటుడు ఇటీవల అమెరికాకు చెందిన ఏజెన్సీ గెర్ష్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. వర్చువల్ కాల్ ద్వారా ఆడిషన్ ప్రక్రియ ఇటీవల పూర్తయిందట. హృతిక్ రోషన్ యొక్క రికార్డ్ చేసిన టేపులను కొన్ని వారాల క్రితం లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియోకు పంపారు. హృతిక్ రోషన్ త్వరలో క్రిష్ 4 చిత్రీకరణను ప్రారంభించనున్నారు. హృతిక్ గనక హాలీవుడ్ సినిమాలో ఫిక్స్ అయితే తన మొదటి అంతర్జాతీయ ప్రాజెక్ట్ ను 2021 చివరి నుండి షూటింగ్ ప్రారంభిస్తాడట. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ ఈ ప్రతిష్టాత్మక బిగ్ బడ్జెట్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం.