హనీ రోజ్ ‘రేచెల్’ తెలుగు టీజర్ రిలీజ్

హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ‘రేచెల్’ టీజర్ విడుదలైంది. వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్‌ హిట్ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా ,  సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు. యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్‌ చూస్తే అర్ధమౌతోంది.

ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు. రాహుల్ మణప్పట్టు కథను అందించగా, స్క్రీన్ ప్లే రాహుల్ మణప్పట్టు, అబ్రిడ్ షైన్ అందించారు.

తారాగణం: హనీ రోజ్, బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టి, జోజీ, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్

టెక్నికల్ టీం:
దర్శకత్వం: ఆనందిని బాల
నిర్మాతలు: బాదుషా ఎన్ ఎం, రాజన్ చిరాయిల్, బ్రిడ్ షైన్
సహ నిర్మాత: హన్నన్ మరముత్తం
కథ: రాహుల్ మనప్పట్టు
స్క్రిప్ట్: రాహుల్ మనప్పట్టు, అబ్రిడ్ షైన్
డీవోపీ: స్వరూప్ ఫిలిప్
మ్యూజిక్ & బీజీఎం: ఇషాన్ ఛబ్రా
ఎడిటర్: మనోజ్
సౌండ్ మిక్స్: రాజాకృష్ణన్ ఎమ్ ఆర్
సౌండ్ డిజైన్: శ్రీ శంకర్
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్స్  – మంజు బాదుషా, షెమీ బషీర్, షైమా ముహమ్మద్ బషీర్
పబ్లిసిటీ డిజైన్స్ టెన్ పాయింట్
పీఆర్వో – వంశీ శేఖర్