కంగనా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్

బాలీవుడ్ క్వీన్ గా హిందీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్. నార్త్ నుంచి ఇప్పుడు సౌత్ ని టార్గెట్ చేసిన కంగనా, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బయోపిక్ లో నటించనుంది. అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలో కూడా తెరకెక్కనున్న ఈ సినిమాకి త‌లైవి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం కంగనా తమిళ్ నేర్చుకోవడంతో పాటు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంటోంది. తలైవి సినిమాలో జ‌య‌ల‌లిత జీవితాన్ని నాలుగు ద‌శ‌ల్లో చూపించ‌బోతున్నార‌ట‌. అందుకోసం కంగ‌నా కూడా నాలుగు షేడ్స్‌లో క‌న‌పించడానికి తన లుక్ లో చేంజెస్ చేస్తోంది. ప్రతి లుక్ లో వేరియేషన్ కనిపించడానికి దర్శక నిర్మాతలు కంగనా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సెట్ చేశారు. ఈ దీపావ‌ళికి సినిమాను సైట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం ఆర్టిస్టులకి అవసరమైన వర్క్ షాప్ జరుగుతోంది.