ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు : HIT 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది?
-ఇందులో మృదుల అనే పాత్రలో కనిపిస్తాను. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీరు టీజర్ ట్రైలర్ లో ఆల్రెడీ చూశారు. ఇంటెన్స్ వైలెన్స్ తో కూడిన క్యారెక్టర్ అది. వైలెన్స్ తో పాటు ఆ క్యారెక్టర్ లో చాలా యాంగిల్స్ ఉంటాయి. అర్జున్ సర్కార్ కి డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్ మృదుల. అర్జున్ సర్కార్ మృదుల మాట తప్పితే ఇంకెవరి మాట కేర్ చేయరు. మృదుల ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో కొన్ని లేయర్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. మీరు సినిమా చూస్తున్నప్పుడే పూర్తిగా తెలుసుకోవాలి.  

ఈ కథలో మీ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?
-నిజానికి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ డైరెక్టర్ శైలేష్ కొలను బ్రిలియంట్ రైటర్. మీరు హిట్, హిట్ 2 సినిమాలు గమనిస్తే ఒక్కొక్క సినిమాకి హీరోయిన్ క్యారెక్టర్జేషన్లో చాలా ఇంపార్టెన్స్ పెరిగి ఉంటుంది. కథలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బ్లెండ్ అయి ఉంటుంది. హిట్ 3 లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ ని ఇంకా బెటర్ చేశారు. కథలో చాలా మంచి కనెక్షన్ ఉంటుంది. కథలో ఎంత ఇంపార్టెంట్ ఉందో సినిమా చూస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది

నాని గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నాని గారి సినిమాలన్నీ చూశాను. నేచురల్ పెర్ఫార్మర్. ఆయన చాలా గ్రౌండెడ్ గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా కంఫర్ట్ ఇచ్చారు. అలాంటి కంఫర్ట్ జోన్ ఇస్తే పెర్ఫార్మన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఈ సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పారని విన్నాం?  
-అవును. చాలా ఇష్టంగా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆల్రెడీ నా క్యారెక్టర్ కోసం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించారు. అయితే  డైరెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చేస్తానని అడిగాను. డబ్బింగ్ చెప్పాను. నా వాయిస్ డైరెక్టర్ గారికి నచ్చింది. నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నా వాయిస్ ఉండడం చాలా ఆనందంగా అనిపించింది. ఓ కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగు అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పాను.

ఇది మీరు తెలుగులో చేస్తున్న మొదటి సినిమా. తొలి సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడం ఎలా అనిపిస్తుంది?
-నేను కథవిన్నప్పుడే చాలా వైలెన్స్ యాక్షన్ ఉందనిపించింది. నిజానికి ఈ స్టోరీ కి అలాంటి వైలెన్స్ యాక్షన్ కావాలి. ఈ సినిమా జోనర్ అటువంటిది.

– కేజీఎఫ్ లో కూడా వైలెన్స్ ఉంది. అయితే అది డిఫరెంట్ వరల్డ్. హిట్ 3  డిఫరెంట్ వరల్డ్.

-నేను దాదాపుగా వైలెన్స్ ఉన్న సినిమాలే చేశాను. కే జి ఎఫ్ డైలాగ్ లో చెప్పినట్టు ‘వైలెన్స్ ఐ డోంట్ లైక్, బట్ వైలెన్స్ లైక్స్ మీ (నవ్వుతూ)  

డైరెక్టర్ శిలేష్ కొలను గురించి ?
-నాకు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చేయడం నాకు ఫస్ట్ టైం. డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రతిదీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నాకు అన్ని నేర్పించారు. ఆయన చాలా మంచి ప్లానింగ్ తో షూట్ చేస్తారు. ఆయన భవిష్యత్తులో అద్భుతమైన సినిమాలు చేసి మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ?  
-మిక్కీ జే మేయర్ గారు అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఇలాంటి థ్రిల్లర్  చేయడం ఆయన కూడా కొత్త. ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫస్ట్ సాంగ్ ప్రేమ వెల్లువ చాలా అద్భుతమైన హిట్ అయింది. అలాగే అనిరుద్  పాడిన పాట కూడా సూపర్ హిట్ అయింది

-డిఓపి షాను గారు  బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. మిగతా టెక్నికల్ టీం అందరు కూడా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. టెక్నికల్ గా సినిమా టాప్ నాచ్ ఉంటుంది.  

కే జి ఎఫ్ 3 లో మీరు కనిపిస్తారా?
-కే జి ఎఫ్ 3 లో నేను ఉన్నానా లేదా అనేది వెయిట్ అండ్ వాచ్. (నవ్వుతూ)

మీరు రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారని విన్నాం?
-నిజానికి ఈ విషయంలో మీకు వివరణ ఇవ్వాలి.  మీడియాలో దీనిపై మిస్ కమ్యూనికేషన్ ఉంది. నేను సీత క్యారెక్టర్ కోసం ఆడిషన్ ఇచ్చాను. అదొక్కటే నిజం. ఆ తర్వాత వాళ్ళు నుంచి నాకు ఎలాంటి కాల్ రాలేదు. అసలు అలాంటి క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసే అంత పెద్ద యాక్టర్ ని నేను కాదు. నేను ఆడిషన్ ఇచ్చిన మాట మాత్రమే వాస్తవం. ఫైనల్ కాల్ ఆ ఫిలిం మేకర్సే తీసుకున్నారు. ఆ పాత్రకు ఫైనల్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను.      

కొత్తగా చేస్తున్న సినిమాలు?
-తెలుసు కదా సినిమా షూటింగ్ జరుగుతుంది.