బాలయ్య భామా… వెంకీ మామాతో…

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మోవిఎలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ మూవీతో కంబ్యాక్ కి రెడీ అయిన ప్రగ్య… విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌… త్వరలోనే ప్రారంభం కానుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ స్పెషల్ సాంగ్ కోసం డైరెక్టర్ అనీల్ రావిపూడి… హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ని సంప్రదించగా, ఆమె వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ సాంగ్‌లో ప్రగ్యాతో పాటు మరో హీరోయిన్‌ సోనాల్‌ చౌహన్‌ కూడా చిందేయనున్నారట. f2లో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ మంచి హిట్ అయ్యింది. మరి ఈ సీక్వెల్ లోని సాంగ్ ఎంత క్లిక్ అవుతుందో చూడాలి.