గంజాయిని ‘తులసి’ ఆకులతో పోల్చిన హీరోయిన్!!

గత కొన్ని రోజులుగా శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కొనసాగుతున్నట్లు అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఒక హీరోయిన్ గంజాయిని ఏకంగా తులసి ఆకులు ఆయుర్వేదానికి ఉపయోగపడే జౌషాదం అంటూ వివరణ ఇవ్వడంతో ట్రోలింగ్ కి గురవుతోంది. చివరిసారిగా పాప్‌కార్న్ మంకీ టైగర్ చిత్రంలో కనిపించిన నటి నివేదా, గంజాయి ఆయుర్వేదంలో కీలకపాత్ర పోషిస్తుందని, ఔషధప్రయోగం ఉందని చెప్పడంతో నెటిజన్ల కోపాన్ని ఎదుర్కొంటోంది.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నివేదా ఈ విధంగా వువరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ “గంజాయి ఆయుర్వేదానికి వెన్నెముక. మన చరిత్రను పరిశీలిస్తే, 1985లో భారతదేశంలో చట్టవిరుద్ధం కావడానికి ముందు గంజాయి (గంజా) విస్తృతంగా పెరిగింది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో ఎక్కువ. గంజాయిని అనేక వ్యాధులను నయం చేయడానికి మరియు విశ్రాంతి ప్రయోజనాల కోసం ఉపయోగించారు. విజయ, అజయ, మధురానీ, సిద్ధి వంటి అధర్వవేద సమయంలో వేర్వేరు పేర్లతో పిలువబడే గంజాయిని తినడం వల్ల అంత ఈజీగా మరణించిన ఒక్క వ్యక్తి కూడా లేడు. 40 కి పైగా దేశాలలో గంజాయి వినియోగం చట్టబద్ధమైనది. క్యాన్సర్, కుష్టు వ్యాధి మరియు క్షయవ్యాధిని నయం చేయడానికి ఆయుర్వేద మెడిసిన్ ఔషధంలో గంజాయిని ఉపయోగించారు అని చెప్పడంతో ఆమె కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.