పోర్న్ స్టార్‌గా “హీరోయిన్” ఎస్తేర్..‌

టాలీవుడ్‌లో ఉత్త‌ర సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌యిన ద‌ర్శ‌కుడు ఎస్ఆర్ తిరుప‌తి.. త‌న రెండో సినిమాను పోర్న్‌స్టార్ క‌థాంశంతో హీరోయిన్ అనే చిత్రంను తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌పంచం కీర్తించే ఇండియా సాంప్ర‌దాయం ముసుగులో మ‌లినం ఉంది. సొసైటీ క‌ళ్ల‌ప్ప‌గించి చూసే క‌ళా రంగం వెనుక గుండె ప‌గిలే గాయం ఉంది. మ‌నం చూసే ప్ర‌తి అద్భుతం వెనుక మ‌రో నిజం ఒక‌టి దాగి ఉందని డైరెక్ట‌ర్ ఎస్ఆర్ ‌తిరుప‌తి ఈ సినిమాపై చెబుతున్నాడు. ఈ మూవీలో ఎస్తేర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..

heroine ester

టాలీవుడ్‌లో ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించింది ఎస్తేర్‌. ఇప్పుడు హీరోయిన్ సినిమాలో పోర్న్‌స్టార్ పాత్ర‌ను పోషిస్తుంది ఎస్తేర్‌. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతుండ‌గా.. లివ్ ఇన్ సి క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఎస్ఆర్ తిరుప‌తి మాట్లాడుతూ.. ఎరోటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా హీరోయిన్‌గా తెర‌కెక్కించ‌బోతున్నామ‌ని.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎస్తేర్ న‌టిస్తుండ‌డంతో పాటు కొన్ని కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం షూటింగ్ స‌న్నాహాల్లో ఉన్నాం.. త్వ‌ర‌లో ఇత‌ర న‌టీన‌టుల సాంకేతిక నిపుణుల పేర్లు వెల్ల‌డిస్తామ‌ని ద‌ర్శ‌కుడు తిరుప‌తి పేర్కొన్నారు.