అక్కినేని హీరోయిన్ మళ్లీ పెళ్లి… ఆ వరుడు ఎవరో మరి?

అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన బెజవాడ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ అమలా పాల్. ఆ తర్వాత ఇద్దరు మెగా హీరోలు రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ సినిమాల్లో కనిపించిన ఈ మలయాళ కుట్టి స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. తెలుగు కన్నా మలయాళ తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో అమలా పాల్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే 2011లో అమలా దైవ తిరుమగళ్ సినిమా చేసింది. ఈ సినిమాని తెరకెక్కించిన విజయ్ తో అమలా ప్రేమలో పడి, 2014లో పెళ్లి కూడా చేసుకుంది.

amala paul marriage

అనివార్య కారణాలు, మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సింగల్ గానే ఉంటూ, తన కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్న అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఈ విషయంపై ఓపెన్ అయిన అమలా పాల్, తానేమి సన్యాసం తీసుకోలేదు, సమయం వస్తే తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని అమలాపాల్ స్పష్టం చేసింది. 27 ఏళ్ల వయసున్న అమలా పాల్ ఎప్పుడు పెళ్లి చేసుకోనుంది, ఎవరిని చేసుకోనుంది అనే విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి.