Kollywood Star: క‌రోనాను జ‌యించిన స్టార్ హీరో..

Kollywood Star: కోలీవుడ్ ‌స్టార్ సూర్య ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా టెస్ట్ చేయించుకుంటే క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ కాగా.. ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరారు సూర్య‌. తాజాగా సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వ‌చ్చింది. కరోనా నుంచి కోలుకోవ‌డంతో సూర్య ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ విష‌యాన్ని సూర్య త‌మ్ముడు హీరో కార్తి సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపాడు. అన్న Kollywood Star సూర్య ఇంటికి చేరుకున్నాడ‌ని.. ప్ర‌స్తుతం క్షేమంగానే ఉన్నాడ‌ని కార్తి పేర్కొన్నాడు.

అలాగే కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంటాడ‌ని.. త‌మ కోసం ప్రార్థ‌న‌లు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషుల‌కు కృత‌జ్ఞ‌త‌లు స‌రిపోవ‌ని వివ‌రించారు. ఇక క‌రోనా వ‌చ్చింద‌ని స్వ‌యంగా Kollywood Star సూర్య తెలిపాడు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నాన‌ని, త‌న‌ను క‌లిసిన వారంద‌రు క‌రోనా టెస్ట్‌లు చేయించుకోవాల‌ని తెలిపిన విష‌యం తెలిసిందే. ఇక ప్ర‌స్తుతంKollywood Star సూర్య న‌టిస్తున్న చిత్రాల షూటింగ్ ఆగిపోయాయి. మ‌రీ ఎప్పుడు షూటింగ్‌లో అడుగుపెడుతారో అని ఎదురుచూస్తున్నారు.