హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” చిత్రంలోని ‘ఏకాంత సమయం’ లిరికల్ వీడియో

హుషారు,షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు తేజ్ కూర‌పాటి సోలో గా హీరోగా వస్తున్న చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రంలో అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇందులోంచి ఓ పాటను విడుదల చేసారు మేకర్స్. డా భవ్య దీప్తి రెడ్డి రచించిన ‘ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్బంగా

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ. హీరో శ్రీకాంత్ తో మేము ట్రావెల్ అవ్వాలనుకున్నాం. అయితే తను ఎంతో బిజీ ఉన్నా మా చిత్రంలోని ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేసినందుకు వారికి మా ధన్యవాదములు. దర్శకుడు వెంకట్ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. డా భవ్య దీప్తి రెడ్డి ఈ సినిమాకు చక్కటి ఐదు పాటలు రాయడం జరిగింది. సంగీత దర్శకుడు సందీప్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులకు ఇట్టే ఆకట్టుకుంటాయి.ఈ సినిమాలో నటించిన నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకొని వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది అన్నారు.

చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ..హీరో శ్రీకాంత్ గారు ఎంతో బిజీ ఉన్నా మా చిత్రంలోని ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. వారికి చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు .ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము..ఈ సినిమాకు పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గార్ల తో పాటు నటించిన వారు మరియు టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ…ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థ గా ఈ చిత్రంగా తెర‌కెక్కించే ఈ చిత్రంలోని ‘ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియోను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు. ఇలాంటి మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వుంటాయి. ప్రేమక‌థ తో పాటు చక్కటి వినొదాన్ని మిక్స్ చేసి తెర‌క్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 2 ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అన్నారు.

యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి మాట్లాడుతూ..ఈ చిత్రంలోని ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు.
సినిమా చూశాను చాలా బాగుంది. ఎంతో ప్యాషన్ తో నిర్మించిన చిత్ర నిర్మాతలకు ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు

న‌టీన‌టులు:

తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు న‌టించ‌గా

టెక్నికల్ టీం:

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ముల్లేటి నాగేశ్వ‌రావు
నిర్మాత‌లు.. ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు
క‌థ‌-స్క్రీన్‌ప్లే- మాటలు ద‌ర్శ‌క‌త్వం.. వెంక‌ట్ వందెల‌
సినిమాటోగ్ర‌ఫి.. పి.వంశి ప్ర‌కాష్‌
సంగీతం.. సందీప్ కుమార్‌
స్క్రీన్‌ప్లే- పాట‌లు.. డాక్ట‌ర్ భ‌వ్య ధీప్తి రెడ్డి
ఎడిట‌ర్‌.. నంద‌మూరి హరి
స్టంట్స్‌.. రామ కృష్ణ‌
కొరియోగ్ర‌ఫి.. గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్
పి .ఆర్. ఓ : మధు వి. ఆర్