శ్రీ విష్ణు రిలీజ్ చేసిన పటారుపాళెం ప్రేమ కథ సాంగ్

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పటారుపాళెం ప్రేమ కథ” శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నోటిస్తున్న ఈ చిత్రం పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని యధార్థ సంఘటనలను ఆధారం చేసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాలో “ఏడవున్నావే ఏడవున్నావే” అనే తొలి పాటను హీరో శ్రీ విష్ణు నిన్న విడుదల చేసారు. ఈ సంధర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ నన్ను సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసిందే ఈ సినిమా దర్శకుడు దొరైరాజు గారు, ఆయన దర్శకత్వం లో వస్తున్న సినిమా పాటను విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, పాట నేను విన్నాను పాట చాలా బాగుంది. మ్యూజిక్ లవర్స్ అందరూ ఈ పాటను విని పెద్ద హిట్టు చేస్తారని ఆశిస్తున్నాను.

అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. దర్శకుడు దొరైరాజు మాట్లాడుతూ ఈ సాంగ్ శ్రీ విష్ణు విడుదల చేయడం నాకు సంతోషంగా ఉంది, ఎంతో నిజాయతీగా తీసిన సినిమా ఇది. టీజర్ ని పెద్ద హిట్టు చేసిన ప్రేక్షకులు ఈ సాంగ్ ని కూడా అంతే పెద్ద హిట్టు చేస్తారని నమ్ముతున్నాను అని అన్నారు. సినిమా టీమ్ అందరూ శ్రీ విష్ణుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు బాలు ధాకే పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి. జిఎస్ రెడ్డి సమర్పణ, వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు ఈ సినిమాను నిర్మించారు.