వయసు టాపిక్ వస్తే నేనే గుర్తోస్తానా?

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన నటుడు సిద్ధార్థ్ . కొన్నాళ్లుగా టాలీవుడ్ పరిశ్రమకు దూరంగా ఉన్న అతను ఇప్పుడు మహా సముద్రం చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ వయస్సుపై ట్రోలింగ్ నడుస్తుంది. తాజాగా ఓ నెటిజన్ ..’40 ఏళ్లు పైబడిన సిద్ధార్థ్ తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ సిద్ధార్థ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

దీనికి సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ . ‘నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్స్ అంటగా’ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఛా! అతను నా దత్తపుత్రుడు.. నేను మోహన్ బాబు గారు క్లాస్‌మేట్స్.. ముందు నిజాలు తెలుసుకో’ అంటూ సిద్ధార్థ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. వాటికి ‘సోది, అరాచకం, పరిస్థితుల ప్రభావం, దారుణం, నా వయస్సు నాకు తెలుసు’ అనే హ్యాష్‌ట్యాగులను జత చేశారు.