RepublicMotionPoster: ‘రిపబ్లిక్’గా వచ్చిన సాయిధరమ్ తేజ్

RepublicMotionPoster: ఇటీవల విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’తో హిట్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా పేరే రిపబ్లిక్. రేపు రిపబ్లిక్ డే కావడంతో.. ఇవాళ ఆ సినిమా మోషన్ పోస్టర్‌ను ఇవాళ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ వీడియోలో సాయిధరమ్ తేజ్ వాయిస్ ఓవర్ హైలెట్‌గా ఉంది.

REPUBLIC MOTION POSTER

దేవకట్ట ఈ సినిమాను తెరకెక్కించనుండగా.. ఐశ్వర్య రాజేష్, జగబతిబాబు, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించనున్నారు. ఇక మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భగవాన్, పుల్లారావు దీనిని నిర్మించనున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో రిపబ్లిక్ సినిమాను విడుదల చేయనున్నారు.