రామ్ తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తో ఫిక్స్?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ సినిమా సంక్రాంతి రోజు విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను మూటకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ తన తర్వాతి సినిమాను వరుస విజయాలతో ఊపు మీదున్న అనిల్ రావిపూడితో చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో రామ్ తర్వాతి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలు ఎక్కలేదు.

ram movie with anil

ఈ క్రమంలో అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ నచ్చడంతో సినిమా చేసేందుకు రామ్ ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజల కాంబినేషన్‌లో ఎఫ్ 3 సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత రామ్ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.