శ్రీవారి సేవలో పాల్గొన్న హీరో నితిన్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు నితిన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేషశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపలకు వచ్చిన నితిన్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. నితిన్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. కొందరైతే నితిన్ ను గట్టిగా లాగి తమతో ఫోటో దిగాలని కోరారు. అందరితో సరదాగా నవ్వుతూ ఫోటోకు ఫోజులు ఇచ్చారు నితిన్

ఆలయం వెలుపల నితిన్ మీడియాతో మాట్లాడుతూ…. సినిమా విడుదల ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాబిన్ హుడ్ సినిమా ఘనవిజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆ దేవదేవుని దర్శనం చాలా బాగా జరిగిందని…. నూతన ప్రాజెక్ట్ గా తమ్ముడు అనే మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నట్లు తెలిపారు.