థియేటర్స్ పై హిరో నాని షాకింగ్ కామెంట్స్

నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు..కానీ సినిమా అనే పాటికి బోలెడు ఆంక్షలు సినిమా అంటే చిన్న చూపు తిమ్మరుసు సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన నాని సినిమా అనేది మన కల్చర్ థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం అనేది మన బ్లడ్ లోనే వుంది. రెస్టారెంట్స్ పబ్స్ ఇతర ప్రదేశాల కన్నా థియేటర్ చాలా సేఫ్ కానీ వాటినే ముందు ముస్తారు లాస్ట్ లో తెరుస్తారు. మనం మన ఇంటి తరువాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. నేను ఒక ప్రేక్షకుడి గా చెపుతున్నాను, మన దేశంలో సినిమా ను మించిన ఎంటర్ టైన్ మెంట్ లేదు థియేటర్ వ్యవస్థ మీద ఆధార పడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్లంతా సఫర్ అవుతున్నారు పరిస్థితులు ఇలానే వుంటే థియేటర్ వ్యవస్థ నాశనం అయిపొద్ది వందల మంది మధ్య కూర్చొని థియేటర్ లో సినిమా చూడటం అనేది నెక్స్ట్ జనరేషన్ కి కష్టమే. అందరూ కలసి ఈ ప్రాబ్లం నీ సాల్వ్ చేయాలి.