రిపోర్టర్స్‌పై ఫైర్ అయిన బాలయ్య

ఇవాళ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నందమూరి నటసింహం బాలకృష్ణ నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. బాలయ్య రావడంతో మీడియా ఆయనను చుట్టుముట్టింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులపై బాలయ్య ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

balayya fires on media

ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతుండగా..’కొంచెం ముందుకు రండి సార్.. కొంచెం వెనక్కి వెళ్లండి సార్ అని మీడియా సిబ్బంది విసిగించారు. దీంతో ‘చాల్ చాల్లే.. మీ సలహాలు.. సూది బెజ్జం అంత సందు ఇస్తే చెవిలో ఉచ్చపోసే రకాలు మీరు’ అంటూ మీడియాపై ఫైర్ అయ్యారు బాలయ్య.

ఇక బాలయ్య సోదరుడు రామకృష్ణ మాట్లాడుతున్న సందర్భంలో ‘మైక్ పెట్టు.. మైక్ పెట్టు తమ్ముడూ’అంటూ ఒక మీడియా ప్రతినిధి అనడంతో.. ‘ఎక్కడా ? మైక్ పెట్టు కాదు.. మైక్ పట్టుకో అను.. నీ యబ్బా’ అంటూ బాలయ్య సీరియస్ అయ్యారు.