నాగ‌శౌర్య ‘ల‌క్ష్య‌’ ఫ్రైడే స్పెష‌ల్‌.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ విడుద‌ల‌

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్ననాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్నిసోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను ఇటీవ‌ల కిక్‌ స్టార్ట్ చేసి #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్ర‌తీ శుక్ర‌వారం ల‌క్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలియ‌జేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ప్ర‌తీ శుక్ర‌వారం విడుద‌ల చేస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఆస‌క్తి పెంచ‌డ‌మే కాదు.. అంచ‌నాల‌ను కూడా పెంచేస్తున్నాయి. ఈ శుక్ర‌వారం ‘ల‌క్ష్య‌’ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో హీరో నాగ‌శౌర్య‌,  ద‌ర్శ‌కుడు ధీరేంద్ర సంతోష్ సీన్ డిస్క‌స్ చేసుకోవ‌డం, సీన్‌లో ఎలా వ‌చ్చింద‌ని హీరో, హీరోయిన్ చెక్ చేసుకోవ‌డాన్ని ఈ స్టిల్స్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ సినిమాలో నాగ‌శౌర్య ఇది వ‌ర‌కెన్న‌డూ చూడ‌ని లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఆ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

తారాగ‌ణం: నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు,సచిన్ ఖేడేకర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం:  ధీరేంధ్ర సంతోష్‌ జాగర్లపూడి
నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్
సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి
సంగీతం: కాల‌బైర‌వ‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్దిఖీ
పిఆర్ఓ: బి.ఎ.రాజు, వంశీ ‍శేఖ‌ర్‌