మోస్ట్ డిజైరబుల్ మ్యాన్స్ వీళ్లే…

హైదరాబాద్ టైమ్స్ ప్రతి ఏటా ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ విడుదల చేసింది.. సినిమా, స్పోర్ట్ పర్సనాలిటీస్ ఈ లిస్ట్‌లో ప్లేస్ దక్కించుకున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూడోసారి తన ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకోవడం విశేషం.

రెండో స్థానంలో రామ్ పోతినేని (ర్యాంక్ 3, మూడో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాలుగవ ప్లేస్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ హీరో నాగశౌర్య (Re-entrant) ఐదవ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ లిస్టులో ఉన్నవారి వివరాలు ర్యాంకుల వారీగా… నాగ చైతన్య (11), ముస్తఫా దావూద్ (New-entrant), సల్మాన్ జైదీ (5), సందీప్ కిషన్ (26), నవదీప్ (15), రానా దగ్గుబాటి (Re-entrant), సిద్ధు జొన్నలగడ్డ (New-entrant), మొహమ్మద్ సిరాజ్ (16), అకిల్ సర్థాక్ (New-entrant), సుధీర్ బాబు (8), అల్లు అర్జున్ (12), వరుణ్ తేజ్ (7), బషీర్ అలీ (6), కార్తికేయ (20), అఖిల్ అక్కినేని (14), ఆనంద్ దేవరకొండ (New-entrant), అడివి శేష్ (14), శ్రవణ్ రెడ్డి (18), విశ్వక్ సేన్ (30), నితిన్ (23), నాని (27), ఆది పినిశెట్టి (25), కిడాంబి శ్రీకాంత్ (22), ప్రణవ్ చాగంటి (10), తరుణ్ భాస్కర్ (24) ఉన్నారు.