‘వాల్మీకి’ టైటిల్ మార్పు.. ఎమోషనల్ అయిన హరీష్ శంకర్!

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్మీకి’ సినిమా టైటిల్ ను ‘గద్దలకొండ గణేష్’ గా మార్చిన సంగతి తెలిసిందే. బోయసామాజిక వర్గం నుండి వ్యక్తమైన ఆందోళన నేపధ్యంలో సినిమా టైటిల్ ని మార్చారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు.