Powerstar: వీర‌మ‌ల్లు వ‌ర్కింగ్ స్టిల్స్‌.. పవ‌ర్‌స్టార్‌ను అలా చూస్తే రెండు క‌ళ్లు స‌రిపోవు!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ క‌ళ్యాన్ అంటే పేరులోనే ఉంది ప‌వ‌ర్‌.. అభిమానులు ఆయ‌నంటే ప‌డిచ‌స్తారు ఆయ‌న‌కు ఫ్యాన్స్ ఉండ‌రు భ‌క్తులే ఉంటారు వంటి ఇలా ప‌వ‌న్‌పై అభిమానాన్ని చాటుకుంటారు. దాదాపు మూడేళ్ల త‌ర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు..దీంతో ఆయ‌న ఏ సినిమా చేసిన ఆ మూవీ అప్‌డేట్ కోసం ప్రేక్ష‌కుల‌తో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా ఎద‌రుచూస్తారు. ఈ నేప‌థ్యంలోనే తాను న‌టిస్తున్న హరిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో నుంచిPowerstar ప‌వ‌న్ క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియోను చిత్ర‌బృందం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంట్లో ఆయ‌న ప‌లు స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తూ క‌నిపిస్తున్నారు.

viramallu

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతున్నాయి.. త‌మ దేవుడు ప‌వ‌ర్‌స్టార్‌ను అలా చూస్తే రెండు క‌ళ్లు స‌రిపోవు అంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదిలా ఉంచితే ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.. ఈ నేప‌థ్యంలో త‌మ అభిమాన న‌టుడు తెర‌పై చూడాల‌ని ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.