Director Krish: ప‌వ‌ర్‌‌స్టార్ ‌”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు”లో ప్ర‌ముఖ స్టంట్ మాస్ట‌ర్‌..

Director Krish: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబినేష‌న్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎమ్‌.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఇందులో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మ‌రో కీల‌క పాత్ర‌ల్లో, బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు ఈ చిత్రం లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.. ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. కాగా తాజాగా మ‌రో అప్‌డేట్ ఇచ్చాడు Director Krish డైరెక్ట‌ర్ క్రిష్..

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ధూమ్‌3, క్రిష్‌3 ప‌లు పీరియాడిక్ సినిమాల‌కు స్టంట్ మాస్ట‌ర్‌గా చేసిన శ్యామ్ కౌశ‌ల్‌.. హరి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం కోసం సూప‌ర్ స్టంట్స్ చేయ‌నున్నాడు.. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్రిష్ తెలుపుతూ.. ప‌వ‌ర్‌స్టార్ కోసం కౌశ‌ల్‌.. హై ఆక్టేన్ స్టంట్ చేయించార‌ని పేర్కొన్నాడుDirector Krish. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు అందిస్తున్నారు.‌