ఆగ్రా సెట్ లో పవర్ స్టార్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిటయిన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హరిహర వీరమల్లు ఒకటి. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ. పవన్ కెరీర్ లోనే మొదటిసారి నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో ఖుషీ వంటి ఇండస్ట్రీ హిట్, కొమరం పులి లాంటి సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ఎలాంటి సెట్స్ కావాలంటే అలాంటి సెట్స్ నిర్మించడానికి నిర్మాత రెడీగా ఉన్నాడు. ఇక డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో పవన్ ని ఎలా చూపించబోతున్నాడో ఇంతకముందు రిలీజ్ చేసిన మోషన్ టీజర్ తో శాంపిల్ చూపించాడు. నాలుగు భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందిస్తున్నాడు. నిధీ అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్విలైన్ ఫెర్నాండస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీరియాడికల్ సినిమా కాబట్టి అప్పటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు చార్మినార్, ఆగ్రా కోట సహా పలు సెట్స్ నిర్మాణం జరుపుతున్నారు. పవన్ కూడా మల్లయోధుల తో శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

కాగా జూలై నుంచి వీరమల్లు షూటింగ్ ప్రారంభించేందుకు దర్శకుడు షెడ్యూల్ రెడీ చేస్తున్నాడని తాజా సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఒక్కసారి పవర్ స్టార్ సెట్ లోకి అడుగుపెడితే క్రిష్ సినిమాను 5 – 6 నెలల్లో థియేటర్స్ లోకి తీకు వస్తాడు. ఇక ప్రస్తుతం నిర్మిస్తున్న ఆగ్రా సెట్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఇక ఇదే సినిమాతో పాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఏకే రీమేక్ షెడ్యూల్ కూడా రెడీ చేయమని పవన్ చెప్పాడట. ఇంతక ముందు చేసినట్టే రెండు సినిమాల షూటింగ్ లో సమాంతరంగా పాల్గొనబోతున్నాడట.