Janasena: హ‌రిరామ‌జోగ‌య్య గారికి జ‌న్మ‌దినం శుభాకాంక్ష‌లు: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్

Janasena: ప్ర‌ముఖ సీనియ‌ర్ రాజ‌కీయ‌నాయ‌కుడు హ‌రిరామ‌జోగ‌య్య నేడు 85వ‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆయ‌న బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. 85వ‌సంతాలు నిండినా హ‌రిరామ‌జోగ‌య్య‌లోని ప్ర‌జాసేవ కాంక్ష నిరంత‌రం జ్వ‌లిస్తూనే ఉందని అన్నారు. ఆయ‌న మాకు రాజకీయం ప‌రంగా ఇప్ప‌టికీ స‌ల‌హాలు ఇస్తూనే ఉంటారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న బ‌ల‌మైన సంక‌ల్పానికి ఆయ‌నే నిద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు..

Janasena pavan

జిల్లా పరిష‌త్ చైర్మ‌న్‌గా, ఎమ్మెల్యేగా, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హోంమంత్రిగా, పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఆయ‌న ప్ర‌జా సేవ చేశార‌ని, నిజాయితీప‌రుడైన నేత‌గా ప్ర‌జ‌ల్లో గుర్తింపు తెచ్చుకున్నార‌ని తెలిపారు. ఆయ‌న‌కు సంపూర్ణ దీర్ఘాయుష్షు, ఆరోగ్య‌క‌ర‌మైన ఆనంద‌మ‌య జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ని కోరుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.‌