ఆహాలో స్ట్రీమ్ అవుతున్న హన్సిక మోత్వానీ హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’

సబరి, గురు సరవణన్ దర్శకత్వం వహించిన హన్సిక మోత్వానీ హారర్ థ్రిల్లర్ గార్డియన్. ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ చిత్రాన్ని భవాని మీడియా ద్వారా ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

2024 మార్చి 8న తమిళంలో విడుదలైన గార్డియన్ ఉలిక్కిపడే కథనంతో, కట్టిపడేసే విజువల్స్‌తో, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్నిమంత్రముగ్ధుల్ని చేసింది.

ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. అందించిన హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కె.ఏ. సక్తివేల్ సినిమాటోగ్రఫీ, అలాగే ఎం. తియాగరాజన్ ఎడిటింగ్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. గార్డియన్ తెలుగు వెర్షన్‌ ని ఆహా లో మిస్ అవ్వకండి.