`తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్` నుండి హన్సిక ఫస్ట్ లుక్ విడుదల

Hansika look from Tenali Ramakrishna BA BL Movie
Hansika look from Tenali Ramakrishna BA BL Movie

శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ హీరో సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్`. ఈ చిత్రంలో హీరోయిన్ హన్సిక పుట్టినరోజు ఆగస్ట్ 9. ఈ సందర్భంగా హన్సిక ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో హన్సిక ఫార్మల్‌గానే కనపడుతుంది. అయితే ఈ చిత్రంలో హన్సిక లాయర్ పాత్రలో కనపడుతుంది. తొలిసారి హన్సిక లాయర్ పాత్రలో నటిస్తుండటం ఆమెకు చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. టాకీపార్ట్ అంతా పూర్తయ్యింది. కేవలం పాటలను చిత్రీకరించాల్సి ఉంది. 
సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. 

నటీనటులు:
సందీప్ కిషన్, హన్సిక, మురళీశర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు 

సాంకేతికవర్గం:
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్
బ్యానర్: శ్రీ నీలకంఠేశ్వరస్వామి క్రియేషన్స్
సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల
కథ: టి.రాజసింహ
మ్యూజిక్: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్
స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ
ఆర్ట్: కిరణ్
యాక్షన్: వెంకట్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్