గుంజన్ సక్సేనా బయోపిక్ లో అవన్నీ అబద్ధాలే.. పైలట్ శ్రీవిద్య సంచలన వ్యాఖ్యలు

గుంజన్ సక్సేనాతో సేవలు అందించిన తోటి పైలట్ శ్రీవిద్య రాజన్, జాన్వి కపూర్ నటించిన గుంజన్ సక్సేనా క్లైమాక్స్‌ సీన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు చూపించిన వీరోచిత చర్యలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. అసలు ఎప్పుడూ ఆ ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు
నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైనప్ప గుంజన్ సక్సేనా బయోపిక్ ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

అయితే రోజురోజుకి ఆ సినిమాసరికొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది. కొన్ని రోజుల క్రితం, భారత వైమానిక దళం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఇప్పుడు, గుంజన్ సక్సేనా తోటి పైలట్ శ్రీవిద్య రాజన్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఒక వివరణ ఇచ్చారు. గుంజన్ సక్సేనా క్లైమాక్స్‌లో చూపించిన వీరోచిత చర్యలు అసలు ఎప్పుడూ జరగలేదని ఆమె పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.

1996 లో గుంజన్ సక్సేనాతో పాటు ఉద్ధంపూర్‌లో పోస్ట్ చేసిన ఏకైక లేడీ ఆఫీసర్ ఆమె మాత్రమే అని శ్రీవిద్య రాజన్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. అయితే సినిమాలో చూపిన విధంగా అవమానకరమైన శారీరక బలం ప్రదర్శనలను మేము ఎప్పుడూ ఎదుర్కోలేదు. మా తోటి అధికారులచే మేము ఎప్పుడూ ఇబ్బందిపడలేదు, అలాగే అవమానించబడలేదని శ్రీ విద్య తెలియజేసారు.