ఆ ఈవెంట్ కి ఈ గెస్ట్ రావట్లేదు…

అక్టోబర్ 2న విడుదల కానున్న మ్యాగ్నమ్ ఓపస్ ‘సైరా’ కోసం మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ అండ్ టీమ్ భారీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతున్నారు. మొదట ప్రీ రిలీజ్ వేడుకను ఉయ్యాలవాడ సొంత జిల్లా అయినా కర్నూల్ ప్రాంతంలో చేయాలనుకున్నారు కానీ అక్కడ క్లైమేట్ బాగోలేక పోవడంతో, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు.

sye raa narasimhareddy teaser launch

మెగా హీరోలంతా రానున్న ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా రానుండడం విశేషం. మెగా బ్రదర్స్ ని ఒకే వేడుకపై చూడడం మెగా అభిమానులకి చాలా సంతోషాన్ని ఇస్తుంది, దాన్ని మరింత పెంచుతూ ఈ ఈవెంట్ కి కేటీఆర్, రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారని సమాచారం. అయితే కేటీఆర్ బిజీ అవ్వడంతో ఈవెంట్ కి రాలేకపోతున్నాడని, మిగిలిన గెస్టులందరూ సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ ని మరింత కలర్ఫుల్ చేయడానికి వస్తున్నారు. సెప్టెంబర్ 18న సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.