విశ్వనాథ్‌ గారు డైరెక్టర్‌గా చివరి చిత్రమదే!

భారతీయ వెండితెరపై శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి అణిముత్యాలను అందించిన కే విశ్వనాథ్ ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన లేని లోటును ఎవరు పూడ్చలేరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారు విశ్వనాథ్. సినిమారంగంలో చేసిన కృషికి గాను… 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు పద్మశ్రీ అవార్డును ఆయన అందుకున్నారు.

విశ్వనాథ్‌ గారు దర్శకత్వం వహించిన చివరి చిత్రం శుభప్రదం (2010) నిర్మించిన ప్రొడ్యూసర్ పీల నీల తిలక్ తన ప్రగాఢ సంతాపాన్ని అయన కుటుంబానికి తెలియజేసారు…