‘చౌర్య పాఠం’ చిత్రాన్ని ఆదరించినందుకుగాను ధన్యవాదాలు తెలుపుతూ గ్రాటిట్యూట్ మీట్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మించిన లేటెస్ట్ సమ్మర్ సూపర్ హిట్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయమయ్యారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 25న  థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాటిట్యూట్ మీట్ నిర్వహించారు  

గ్రాటిట్యూట్ మీట్ లో ప్రొడ్యూసర్ త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. ముందుగా బాయ్స్ కంగ్రాట్యులేషన్స్. సినిమా తీయడం ఒక ఎత్తైతే దాన్ని రిలీజ్ చేయడం నెక్స్ట్ లెవెల్. దాన్ని దాటి గ్రాటిట్యూడ్ మీట్ వరకు వచ్చాం. ఇది చిన్న సినిమా. 150 సెంటర్లో రిలీజ్ చేసాము. ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళు. టాక్ స్ప్రెడ్ అవ్వడానికి  ఎక్కువ టైం పట్టింది. ఇది రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మూడో రోజు బుకింగ్స్ ఇంకా బెటర్ గా ఉన్నాయి. రోజురోజుకి పెరుగుతున్నాయి. మా టీం తో అన్ని థియేటర్స్ కి వెళ్లాను. నాలుగు సార్లు సినిమా చూశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఫోటోగ్రఫీ పెర్ఫార్మెన్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్టర్స్ కాకుండా క్యారెక్టర్స్ కనిపిస్తున్నారని ఆడియన్స్ చెబుతున్నారు.  కొత్తవాళ్ళైనా సరే చాలా అద్భుతంగా చేశారని చెబుతున్నారు.  రివ్యూస్ కూడా చాలా బావున్నాయి.  మంచి సినిమా తీశారని ప్రశంసలు వచ్చాయి. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి. సినిమా చాలా బాగుంది. కొత్త టీం ని ఎంకరేజ్ చేయండి.  ఈ సినిమా సక్సెస్ మీట్ చేద్దాం. మీరంతా రావాలి. మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఆడియన్ కి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మళ్లీ కోరుతున్నాను. థియేటర్స్ కి రండి సినిమా చూడండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థాంక్యూ’అన్నారు.

హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నిన్న ఎనిమిది సినిమాలు దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జెన్యూన్ గా చెప్పాలంటే మా సినిమాని ఆడియన్స్ చాలా హానెస్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఆడియన్స్ కోసం సినిమా తీశాం. ఈరోజు సినిమా రిలీజ్ అవ్వడమే సగం సక్సెస్. మేము అన్ని అడ్డంకులు దాటుకుని సినిమాని రిలీజ్ చేశాం.  సినిమా చూసిన ఆడియన్స్ జెన్యూన్ గా సినిమా చాలా బాగుందని చెప్తున్నారు.  డిఫరెంట్ ఫిలింగా చేసాము. ఈరోజుల్లో ఆడియన్స్ థియేటర్స్ రావడం కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాకి వచ్చి ప్రోత్సహిస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఓపెనింగ్స్ బెటర్గా ఉన్నాయి.  వైజాగ్ విజయవాడ ముఖ్యంగా చిత్తూరులో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. స్పెషల్ గా స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.  మీ అందరి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన త్రినాధ రావు గారికి,  కార్తీక్ గారికి, నిఖిల్ కి అందరికీ ధన్యవాదాలు’ అన్నారు

డైరెక్టర్ నిఖిల్ మాట్లాడుతూ…అందరికి నమస్కారం. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చాలా బాగుంది. ఎంటర్టైనింగ్ గా ఉంది ఎంగేజింగ్ గా ఉందని ఆడియన్స్ చెపుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని గారికి కృతజ్ఞతలు. నిన్న నాలుగైదు థియేటర్స్ కి వెళ్ళాము. మేము ఎక్స్పెక్ట్ చేసిందని కంటే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సినిమాని చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. సినిమా థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందరికీ థాంక్యూ సో మచ్. చూసినవాళ్లు చూడని వారికి చెప్పండి. చాలా మంచి సినిమా ఇది. డెఫినెట్గా థియేటర్స్ లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి’అన్నారు  

మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాంద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  సినిమా చూసినోళ్లు అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రినాధ్ గారికి, కార్తిక్ అందరికీ థాంక్ యూ’అన్నారు.  

యాక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా వండర్ఫుల్ జర్నీ. ఈ సినిమా కోసం కొత్త నటీనట్లను తీసుకున్న దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చాలా ఎంగేజింగ్ గా ఉంది. అందరూ థియేటర్స్ లో చూసి సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ’అన్నారు.