

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్‌టైన్‌మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి హీరోని మనం సొంతం చేసుకుంటే.. ఆ హీరో ఏం చేసినా మనకు చాలా నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రదీప్ అలాంటి ఇమేజ్‌ను ఇక్కడ సొంతం చేసుకున్నారు. ఇక ప్రదీప్‌ని సినిమా సినిమాకి గ్యాప్ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను. అశ్వత్ మారిముత్తు అద్భుతమైన దర్శకుడు. ట్రైలర్ కట్ చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనిపిస్తోంది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఓ బ్రాండ్. టాలెంట్ హంట్‌లో మైత్రి రవి గారు చాలా ముందుంటారు. తెలుగులో మైత్రి ఎలానో.. తమిళంలో ఏజీఎస్ అలా ఉంటుంది. ఎప్పుడూ కొత్త కంటెంట్, కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తుంటారు. ఎస్ కే ఎన్ మాట్లాడిన తరువాత మనం మాట్లాడటానికి ఏం ఉండదు. ఈ సినిమాకు తెలుగు డైలాగ్స్ బాగా రాశారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. ఈ మూవీని అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘లవ్ టుడే టైంలో ఇక్కడకు వచ్చినప్పుడు అందరికీ మాట ఇచ్చా. నెక్ట్స్ టైం ఇక్కడకు వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడతా అని చెప్పా. అందుకే ఇప్పుడు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. మాటిస్తే చేస్తామా? లేదా? అన్న దానికంటే.. అసలు ప్రయత్నించామా? లేదా? అన్నదే ముఖ్యం. అదే మా డ్రాగన్ చిత్రం. ఓ మామూలు అబ్బాయి.. జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే మా డ్రాగన్. ప్రతీ ఒక్కరం ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నించే ప్రతీ ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నన్ను ఆదరించే తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఏదైనా సరే ప్రయత్నిస్తూ వెళ్తూ ఉంటే.. ఏదో ఒకరోజు సాధిస్తాం. లవ్ టుడే సినిమాను తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. బేబీ మూవీని చూసిన తరువాత సాయి రాజేష్ గారితో చాలా మాట్లాడాను. నేను ఆ మూవీని చూసి చాలా ఏడ్చాను. మూవీని చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మా కోసం వచ్చిన కిషోర్ తిరుమల గారు, హరీష్ శంకర్ గారు, ఎస్ కే ఎన్ గారికి థాంక్స్. మా సినిమాను నిర్మించిన అర్చన మేడంకి థాంక్స్. అశ్వత్, నేను కాలేజ్‌లో ఉండేవాళ్లం. మాది పదేళ్ల పరిచయం. అశ్వత్ లాంటి ఓ ఫ్రెండ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రికి థాంక్స్. మైత్రి బ్యానర్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మళ్లీ అర్చన గారు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ.. ‘తెలుగు ఆడియెన్స్ నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు.. నువ్వు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు అని ప్రదీప్‌కు చెప్పాను. ఈరోజు ఆయన ఈవెంట్‌లో అద్భుతంగా మాట్లాడారు. అలాంటి డెడికేషన్ ఉంది కాబట్టే ప్రదీప్ ఈ స్థాయికి వచ్చాడు. ఏజీఎస్ అనేది నాకు హోం బ్యానర్. నెక్ట్స్ చిత్రాన్ని వాళ్ల బ్యానర్‌లోనే చేస్తున్నాను. నాకు వెన్నంటే ఉండి నన్ను నడిపించింది ఏజీఎస్ బ్యానర్. బేబీ ఫస్ట్ హాఫ్ చూసే సాయి రాజష్‌కు ఫోన్ చేశాను. హరీష్ శంకర్ గారు చేసిన సినిమాలన్నీ నాకు ఇష్టం. ఎస్ కే ఎన్ గారు సినిమాల్ని అద్భుతంగా పబ్లిసిటీ చేస్తారు. మైత్రి బ్యానర్లో పని చేయాలని ప్రతీ ఒక్క టెక్నీషియన్ కోరుకుంటారు. కయాదు చక్కగా నటించారు. అనుపమ అద్భుతమైన నటి. ఆమె తమిళ్, తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తెలుగు డైలాగ్స్‌ని కృష్ణ రాశారు. ఆయన ఇప్పుడు ఎస్ కే ఎన్ గారితో సినిమా చేస్తున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. మంచి చిత్రాలను తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పుడూ ఆదరిస్తుంటారు. డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా అవుతుంది. మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. ‘మా బేబీ సినిమాకు ప్రదీప్ గారు, అశ్వత్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా చిత్రాన్ని చాలా ప్రశంసించారు. ప్రదీప్ గారి లవ్ టుడే ట్రైలర్ చూసినప్పుడే నెక్ట్స్ లెవెల్ అని ఫిక్స్ అయ్యాను. అశ్వత్ గారు చేసిన ఓరి దేవుడా నాకు చాలా ఇష్టం. ఈ డ్రాగన్ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుంది. ఈ చిత్రానికి తెలుగు వర్షెన్ డైలాగ్స్ రాసిన కృష్ణ నాకు ఆల్రెడీ కథ చెప్పేశారు. ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోంది. పుష్పను తమిళంలో ఏజీఎస్ అద్భుతంగా రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని ఆడియెన్స్‌ను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కయాదు లోహార్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హరీష్ శంకర్ గారికి, సాయి రాజేష్ గారికి థాంక్స్. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఇదే నా మొదటి తమిళ, తెలుగు సినిమా. అశ్వత్ అద్భుతమైన దర్శకుడు. క్వాలిటీ కంటెంట్, న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ఉన్న ఇలాంటి ప్రొడక్షన్ కంపెనీలో మళ్లీ మళ్లీ పని చేయాలని అనిపిస్తుంది. ప్రదీప్ చాలా టాలెంటెడ్. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అన్నింట్లో ప్రదీప్ తన మార్క్ వేశారు. డ్రాగన్ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత అర్చనా కల్పాతి మాట్లాడుతూ.. ‘మా లవ్ టుడే సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. ప్రదీప్, అశ్వత్ మారిముత్తులను తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇది కేవలం యూత్ మూవీ కాదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది. పుష్ప చిత్రాన్ని మాకు ఇచ్చిన మైత్రీ వారికి థాంక్స్. మా డ్రాగన్ సినిమాను అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.


మైత్రి నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. ‘మా ప్రదీప్ చేసిన లవ్ టుడే తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయింది. ఆ తరువాత ప్రదీప్ గారిని, నిర్మాతలను కలిసి మాట్లాడాను. ఇప్పుడు ప్రదీప్ గారితో మేం సినిమాను చేస్తున్నాం. ఆ డైరెక్టర్ కథ చెప్పడం, అది నచ్చడంతో సినిమా ప్రారంభించేశారు. ఆ డైరెక్టర్ బైకు మీద వస్తున్నాడని తెలిసి ప్రదీప్ గారు కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. సినిమా హిట్ అయితే గిఫ్టులు ఇస్తారు కానీ.. ఇలా కథ నచ్చిన వెంటనే గిఫ్ట్ ఇవ్వడం మొదటి సారి చూశాను. ప్రదీప్ గారు చాలా గ్రేట్. అర్చన గారు మంచి కథలు అటు తమిళం, ఇటు తెలుగులో విజయాలు అందుకుంటున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘ప్రదీప్ రంగనాథన్ రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్‌కు చాలా పెద్ద అభిమానిని. ఈ డ్రాగన్ చిత్రం కూడా లవ్ టుడే మాదిరిగానే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రదీప్, అశ్వత్ గారు నా ‘బేబీ’ టైంలో ఫోన్ చేసి మెచ్చుకున్నారు. డ్రాగన్ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘లవ్ టుడే ట్రైలర్ చూసినప్పుడే బ్లాక్ బస్టర్ అనిపించింది. ఇప్పుడు డ్రాగన్ ట్రైలర్ చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే అనిపించింది. ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా నటించాడని అనిపిస్తోంది. అశ్వత్ టేకింగ్, స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.