సంక్రాంతి శుభాకాంక్షలు తో ప్రముఖ రచయిత “చిన్ని కృష్ణ” చేతులు మీదుగా యూసఫ్ గూడ లో గ్రాండ్ గా ఓపెన్ “అవర్ ఫ్యాక్టరీ”

హైదరాబాద్ యూసఫ్ గూడ లోని శ్రీశైలం యాదవ్ అన్న అధ్వర్యంలో “అవర్ ఫ్యాక్టరీ”ను గ్రాండ్ గా ఓపెన్ చేశారు రచయిత చిన్నికృష్ణ. ఈ “అవర్ ఫాక్టరీ” లో యూత్ కి సంబంధిన అన్ని రకాల వస్త్రాలు రిజనబుల్ ప్రైస్ లో లభిస్తాయి.కేవలం బట్టలు మాత్రమే కాకుండా, షూస్ , బెల్ట్స్ ఇలా యూత్ కి సంబంధించిన మెటీరియల్ అంతా ఈ అవర్ ఫ్యాక్టరీ లో లభించనున్నాయి.

కేవలం యూత్ కి మాత్రమే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు కావాల్సిన అన్ని థింగ్స్ “అవర్ ఫ్యాక్టరీ” లో లభించనున్నాయి.కేవలం అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్ తో బట్టలు అందించాలని ఉద్దేశ్యంతో దీనిని స్థాపించారు. యూసఫ్ గూడ లోని ఈ “అవర్ ఫాక్టరీ” భారీ స్థాయిలో ఓపెన్ అయింది.

చిన్నికృష్ణ మాట్లాడుతూ…
తమ్ముడు కోటి వినుకొండ లో పార్వతీపురం లో ఈ అవర్ ఫాక్టరీ ను ఇదివరకే పెట్టారు.ఇప్పుడు యూసఫ్ గూడ లో పెట్టడం చాలా ఆనందంగా ఉంది.శ్రీ శైలం యాదవ్ అన్న అంటే తెలియని వారు ఉండరు. వాళ్ళు కోటికి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది.

నవీన్ యాదవ్ మాట్లాడుతూ..
ఒక పదిహేను వందల రూపాయిలలో ఒక జత బట్టలు రావడం చాలా కష్టం.అటువంటిది కేవలం పదిహేను వందల రూపాయిలలో
సూస్,బట్టలు అన్నీ ఇవ్వడం గ్రేట్.రహమత్ నగర్, ఎర్రగడ్డ లో ఉండే మిడిల్ క్లాస్ పీపుల్ కు అందుబాటులో ఉండే ధరలలో తమ్ముడు కోటి అందిస్తున్నాడు. తమ్ముడు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు.

శ్రీ శైలం యాదవ్ మాట్లాడుతూ…
ఈ అవర్ ఫ్యాక్టరీ ఇంకా అభివృద్ధి చెందాలి.రంగారెడ్డి,మెదక్ నల్గొండ మొత్తం 100 షాప్స్ పెట్టడానికి నా సపోర్ట్ ఉంటుంది.

ప్రముఖ సోషల్ ఆక్టివిస్ట్, నటుడు కోఠి యాదవ్ మాట్లాడారు. “నేనిప్పటివరకు చాలా సేవా కార్యక్రమాలు చేశాను ఆనాటి హుద్ హుద్ నుంచి నేటి కరోనా వరకు చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అలాగే దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, కాటమరాయుడు, భారత్ అనే నేను, ఖైదీ నెంబర్ 150, గుంటూరోడు, సప్తగిరి ఎల్ఎల్ బీ, మహర్షి సహా మొత్తం 20 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం పలు సీరియల్స్ లో రాధమ్మ కూతురు , అమ్మాయిగారు ప్రస్తుతం చేస్తున్నాను . సోషల్ వర్క్, యాక్టింగ్ తో పాటు తాజాగా బిజినెస్ చేస్తున్నాను. అవర్ ఫ్యాక్టరీ అనే పేరు తో బట్టల వ్యాపారం ప్రారంభించాం. ఈ రోజు యూసఫ్ గూడ లో కొత్త బ్రాంచ్ ను ప్రముఖ రచయిత చిన్నికృష్ణ, శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ గారు గ్రాండ్ గా ప్రారంభించారు. ఇక్కడ బ్రాండ్ దుస్తులను కూడా తక్కువ ధరకే లభిస్తాయి. అవర్ ఫ్యాక్టరీ ని 100కు పైగా బ్రాంచ్ లకు విస్తరించబోతున్నాం. ఈ అవర్ ఫ్యాక్టరీ ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను” అని అన్నారు.