#SDGM గ్రాండ్ గా లాంచ్ – జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్  

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ 2023లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన తన లాస్ట్ ఔటింగ్ ‘గ‌ద‌ర్ 2’ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 100 సినిమాల దిశగా దూసుకుపోతున్న సన్నీ డియోల్ యాంగ్రీ యాక్షన్ హీరోగా అలరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ వై రవి శంకర్, నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా, గ్రాండ్‌గా నిర్మించే స్ట్రెయిట్ హిందీ సినిమా కోసం బ్లాక్‌బస్టర్ మెషిన్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు సన్నీ డియోల్.

క్రాక్, వీరసింహా రెడ్డి వంటి రెండు వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్‌తో #SDGM చిత్రాన్ని మ్యాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. ఇది గోపీచంద్ మలినేని మేడిన్ హిందీ మూవీ. మునుపెన్నడూ చూడని యాక్షన్‌ అవతార్‌లో హీరోని ప్రెజెంట్ చేయనున్నారు. సౌత్ దర్శకులతో బాలీవుడ్ స్టార్ల సినిమాలపై నార్త్ ప్రేక్షకులు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు.

సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రిషి పంజాబీ డీవోపీ కాగ, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.ఈ భారీ చిత్రానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్,అనల్ అరసు మరియు వెంకట్ మాస్టర్స్ ఫైట్ కొరియోగ్రాఫర్స్ గా వ్యవహరించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్టార్‌లతో హై-బడ్జెట్ సినిమాలు తీయడంలో ప్రసిద్ధి చెందాయి. రెండు నిర్మాణ సంస్థలు,  డైరెక్టర్ సరైన సమయంలో సరైన మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. #SDGM హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ బిగ్ కాన్వాస్‌పై రూపొందనుంది.

ఈరోజు హైదరాబాద్‌లో కోర్ టీమ్, ప్రత్యేక అతిథులతో సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మాస్ ఫీస్ట్ లోడింగ్ అనేది ఈ మూవీకి క్యాప్షన్. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

నటీనటులు: సన్నీ డియోల్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, టిజి విశ్వ ప్రసాద్
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
సిఈవో: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : బాబా సాయి కుమార్ మామిడిపల్లి, జయ ప్రకాష్ రావు (జేపీ)
యాక్షన్ కొరియోగ్రాఫర్: అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్
డైలాగ్స్: సౌరభ్ గుప్తా
రైటింగ్ టీం: ఎం వివేక్ ఆనంద్, నిమ్మగడ్డ శ్రీకాంత్, శ్రీనివాస్ గవిరెడ్డి, మయూఖ్ ఆదిత్య కృష్ణ
కాస్ట్యూమ్ డిజైనర్లు: భాస్కీ (హీరో), రాజేష్ కమర్సు
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
VFX: దక్కన్ డ్రీమ్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో