ఘనంగా ‘కిస్ కిస్ కిస్సిక్’ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్

మోస్ట్ ఎవైటెడ్ హోల్స్సమ్ ఎంటర్ టైనర్ ‘కిస్ కిస్ కిస్సిక్’ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. శివ్ హరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శుశాంత్, జాన్య జోషి, విధి వంటి న్యూ ట్యాలెంట్ పరిచయం అవుతుండగా, విజయ్ రాజ్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గణేష్ ఆచార్య భార్య విధి ఆచార్య (V2S ప్రొడక్షన్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గణేష్ ఆచార్య స్వయంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. అద్భుతమైన ట్రాక్ రికార్డ్ వున్న  మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వెజ్ లో గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 21న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో గణేష్ ఆచార్య మాస్టర్ మాట్లాడుతూ.. నన్ను, ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి థాంక్ యూ. వారు నాకు చాలా ప్రేమని ఇచ్చారు. పుష్ప 1, పుష్ప 2 ఈ రెండు చిత్రాలు కలిపి దాదాపు ఐదేళ్ళు వాళ్ళ కంపెనీలో పని చేశాను. వాళ్ళతో వర్క్ చేస్తున్నపుడు ఫ్యామిలీతో వర్క్ చేసినట్లుగానే వుంటుంది. ప్రతిది ప్లాన్ గా చేస్తారు. ప్రతిది రెడీగా వుంటుంది. నేను వర్క్ చేసిన బెస్ట్ కంపెనీ ఇది. పుష్ప ‘కిస్ కిస్ కిస్సిక్’ సాంగ్ బిగ్ హిట్. ఇదే టైటిల్ తో ఈ సినిమా మార్చి 21న వస్తోంది. ఇందులో చాలా బ్యూటీఫుల్ కాన్సెప్ట్ వుంది. యాక్షన్ రియల్ షతీస్ చేశారు. తొమ్మిది పాటలు వున్నాయి. న్యూ ట్యాలెంట్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వీళ్ళకి ఎలాంటి సినీ నేపధ్యం లేదు. చాలా కష్టపడి వర్క్ చేశారు. ట్రైలర్ లో ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు సినిమా నాకు చాలా నచ్చింది. బన్నీ, చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి గారు లాంటి బిగ్ స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇక్కడ నటులకు, టెక్నిషియన్స్ కి గొప్పగా గౌరవిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు చాలా ఇష్టం. మార్చి 21న ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. యాక్షన్ రోమాన్స్ సాంగ్స్ అన్నీ అలరిస్తాయి. సినిమా హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషలో అందుబాటులో వుంది. తప్పకుండా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  

మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా మేము చేయడానికి ప్రధాన కారణం గణేష్ ఆచార్య మాస్టర్. గణేష్ ఆచార్య మాస్టర్ తో మాకు చాలా మంచి అసోసియేషన్ ఉంది. మాకు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా రషెస్ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి. గణేష్ మాస్టర్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. సినిమాని చాలా లావిష్ గా తీశారు. సీజన్డ్ ప్రొడ్యూసర్ లా అనిపించారు. సినిమా మంచి ఎంటర్ టైనర్.  మొత్తం తొమ్మిది పాటలు వున్నాయి. అందులో ఐదు పాటలు ట్రెండింగ్ లో వున్నాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  

హీరో సుశాంత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. హైదరాబాదుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మాది తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్. నాకు తెలుగు ఆడియన్స్ తో చాలా డీప్ కలెక్షన్ ఉంది. ఈ సినిమా మంచి కమర్షియల్ ప్యాకేజ్ లా ఉంటుంది. యాక్షన్ రొమాన్స్ కామెడీ సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. ఫ్యామిలీ అందరితో కలిసి చూడదగ్గ సినిమా ఇది. తప్పకుండా సినిమాను చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. గణేష్ ఆచార్య మాస్టర్ గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం  అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నాపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు అందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను .ఈ సినిమాకి ఆయనే బ్యాక్ బోన్. ఈ సినిమా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్’ అన్నారు.  

యాక్టర్ జాన్య జోషి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం హైదరాబాద్ కి ఫస్ట్ టైం రావడం చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాకి హిందీ టైటిల్ పింటూకి పప్పి. నేను పప్పీ రోల్ ప్లే చేశాను ఈ సినిమాలో అద్భుతమైన పాటలు కథ కామెడీ సీన్స్ ఉన్నాయి.రొమాన్స్ ఎమోషన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. గణేష్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలకు ధన్యవాదాలు’ అన్నారు.  

యాక్టర్ విధి మాట్లాడుతూ…. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈనెల 21న రిలీజ్ అవుతున్న మా కిస్ కిస్ కిస్సిక్ ప్రమోషన్స్ కి హైదరాబాద్ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఇష్టం ప్రేమతో ఈ సినిమా చేశారు అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గణేష్ ఆశ్చర్య మాస్టర్ గారికి ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది. మాస్టర్ గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయన చాలా హంబుల్ గా ఉంటారు ఆయనతో సుశాంత్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అన్నారు.