గోపీచంద్ హీరోగా, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం ప్రారంభం

Gopichand, Sri Venkateswara Cine Chitra banner movie launch

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై `ఛ‌త్ర‌ప‌తి`, `సాహ‌సం`, `అత్తారింటికి దారేది`,నాన్న‌కు ప్రేమ‌తో..` ` వంటి చిత్రాల‌ను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించి భారీ చిత్రాల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌. ముఖ్యంగా ఈయ‌న‌ నిర్మాణంలో టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా ట్రెజ‌ర్ హంటింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన `సాహ‌సం` మేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. మ‌రోసారి ఈ స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్ ప్రొడ‌క్షన్ నెం.26 సినిమా ప్రారంభ‌మైంది.

సంతోష్ శివ‌న్‌, జ‌యం రాజా వ‌ద్ద అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేసిన బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అడ్వెంచ‌ర‌స్ మూవీగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు స‌తీష్.కె సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ….

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ – “సాహసం తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు బిను సుబ్ర‌మ‌ణ్యం చెప్పిన క‌థ చాలా బావుంది. `సాహ‌సం` ట్రెజ‌ర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచ‌ర‌స్‌గా ఉంటుందో.. ఈసినిమా దాన్ని మించి ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. అన్ కాంప్ర‌మైజ్‌డ్‌గా సినిమాను నిర్మిస్తాం. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.