Tollywood: గోపీచంద్‌-త‌మ‌న్నాల “సీటీమార్” సినిమా వాయిదా..

Tollywood: టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్‌, మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా హీరోహీరోయిన్ల్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం సీటీమార్‌. మ‌హిళా క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాస్ చిట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో భూమిక న‌టిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న తెర‌పైకి తీసుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించిన చిత్ర‌బృందం..

Gopichand

ఇప్పుడు తాజాగా ఈ చిత్రం వాయిదా వేసుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామ‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. కాగా ఏప్రిల్ 2న కింగ్ నాగార్జున న‌టించిన వైల్డ్ డాగ్ చిత్రం విడుద‌ల‌వుతుంది.. అలాగే త‌మిళ్ హీరో కార్తి న‌టించిన సుల్తాన్ చిత్రం కూడా ఏప్రిల్ 2న రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో సీటీమార్ సినిమాను వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది.