బాలయ్య బాబు కోసం క్రాక్ ఇచ్చే మ్యూజిక్

క్రాక్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టడమే కాకా సరైన సినిమా పడితే తెలుగు సినీ అభిమానులు థియేటర్స్ కి వస్తారు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని, నట సింహం నందమూరి బాలకృష్ణతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బాలయ్య పుట్టిన రోజు సంధర్భంగా ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

తాజాగా అఖండ ఫైనల్ షెడ్యూల్ మొదలు పెట్టిన బాలకృష్ణమ్ త్వరలోనే గోపీచంద్ మలినేని మూవీ సెట్స్ లోకి రానున్నాడు. క్రాక్ ని మించే మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఈ NBK107 మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. ఈ విషయాన్నీ ట్వీట్ ద్వారా తెలియజేసిన తమన్, దిస్ వన్ ఈజ్ ఏ ఫైర్ క్రాకర్ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ మూవీకి మ్యూజిక్ ఇస్తున్న తమన్, టీజర్ తో మెప్పించాడు. అఖండ టీజర్ కి తమన్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ స్పెల్ బౌండ్ చేసింది. అదే స్థాయిలో బాలకృష్ణ గోపీచంద్ మలినేని మూవీకి ఇస్తాడని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ కి, తమన్ ప్రస్తుతం ఉన్న ఫామ్ కలిస్తే థియేటర్స్ లో విజిల్స్ పడడం గ్యారెంటి.