కథ మారింది, కథనం అడ్డం తిరిగింది. మొత్తానికి గుడ్ న్యూస్ ట్రైలర్ అదిరింది

ఈమధ్య కాలంలో పిల్లలు పుట్టడం కోసం పెళ్లి అయిన వాళ్లు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా జాబ్స్ చేసే వాళ్లు వర్క్ స్ట్రెస్ తో పర్సనల్ లైఫ్ పై కాన్సెన్ట్రేట్ చెయ్యట్లేదు. అడ్డమైన చెత్త తింటున్నారు, సిగరెట్లు తాగుతున్నారు… ఈ కారణంగా స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, సెక్సువల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నారు. ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లెమ్స్ కలిసి ప్రెగ్నెన్సీ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. వీటిని మెడికల్ ట్రీట్మెంట్ తో సాల్వ్ చేస్తూ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ని పోగొట్టే ఎన్నో పద్ధతులు మన దెగ్గర ఉన్నాయి. అందులో IVF ఒకటి. సమస్య తీర్చాల్సిన IVF ఏ కొత్త సమస్య తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ తో తెరకెక్కిన సినిమా ‘గుడ్ న్యూస్’.

అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియారా, దిల్జిత్ మెయిన్ కాస్ట్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సెక్సువల్ లైఫ్ ద్వారా ఇబ్బంది పడుతున్న బాత్రా ఫ్యామిలీ, డాక్టర్ ని కలిసి స్పెర్మ్ ఎగ్ లని మిక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని తెలుసుకుంటారు. మరో బాత్రా ఫ్యామిలీ కూడా IVF ట్రీట్మెంట్ కోసమే హాస్పిటల్ కి వస్తారు. ఇదే సమయంలో పేర్లు ఒకటే కావడంతో అక్షయ్ కుమార్ స్పెర్మ్ కియారాలోకి… దిల్జీత్ స్పెర్మ్ కరీనాకి ఎక్కిస్తారు. ఇక్కడ మొదలైన అసలు హంగామా ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అన్నీ కలిసిన జర్నీని చూపిస్తూ గుడ్ న్యూస్ ట్రైలర్ సాగింది. ఒక హాస్పిటల్ చేసిన తప్పు కారణంగా ఈ రెండు జంటల జీవితాలు ఎన్ని అవస్థలు పడ్డాయి అనేది చాలా నోవెల్టి పాయింట్. మరి అనుకున్న కథ అడ్డం తిరిగి, కథనం పూర్తిగా మారిపోయిన ఈ జంటల జీవితాలు ఎన్ని కష్టాలు పడ్డాయి? చివరికి ఎవరి బిడ్డని ఎవరు పంచుకున్నారు అనేది తెలియాలి అంటే డిసెంబర్ 27 వరకూ ఆగాలి.