

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.
బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ లో నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ .తెలుగులో చాలా బ్లాక్ బస్టర్ తీసాము. ఈ సినిమాని రోహిణి థియేటర్స్ లో చూసాము. థియేటర్ ప్యాక్డ్ గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ విజువల్ ని మర్చిపోలేను. సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్. ఇదంతా మా హీరో అజిత్ గారి వలన. డైరెక్టర్ అధిక్ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. అజిత్ గారు చాలా సింపుల్ పర్సన్. ఆయన మనసుతో మాట్లాడే మనిషి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అధిక్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేశాడు. ఇంత గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాని 95 డేస్ లో కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. అధిక్ లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి కావాలి. జివి గారు, ప్రియా, కార్తీక్ అందరికీ థాంక్యు. సునీల్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమా రెండు గంటల రోలర్ కోస్టర్ రైడ్. ఎక్కడ ఆగదు. పరిగెడుతూనే ఉంటుంది. తమిళనాడు ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ అన్నిచోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. చాలా పెద్ద విజయం సాధించబోతుంది. అజిత్ గారికి టీమ్ అందరికీ మరోసారి థాంక్యూ’అన్నారు
డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి మ్యూజిక్ స్ట్రాంగ్ పిల్లర్. జీవి ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియా క్యారెక్టర్ ఆడియన్స్ ని అలరించింది. కార్తికేయ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా క్రూషియల్. సునీల్ గారు ఇందులో క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అజిత్ గారు కూడా ఆ క్యారెక్టర్ ని సునీల్ గారు చేస్తేనే బాగుంటుందని అన్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. డిఓపి అభినందన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. వాళ్లు తమిళ్లో చేసిన ఫస్ట్ సినిమా ఇది. నాకు చాలా సపోర్ట్ చేశారు. నవీన్ గారు లాంటి హంబుల్ స్వీట్ ప్రొడ్యూసర్ ని నేను చూడలేదు. చాలా గొప్పగా చూసుకున్నారు. ఈ సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం నవీన్ గారు. మైత్రి మూవీ మేకర్స్ తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేశారు. వారి సపోర్ట్ కి థాంక్యూ. ప్రతి డైరెక్టర్ డ్రీమ్ మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం. నన్ను బిలీవ్ చేసి ఈ సినిమా ఇచ్చిన అజిత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు’ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఇది ఒక అదృష్టం. అజిత్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడ నుంచి వచ్చాడో ఆలోచించకుండా ఒప్పుకోవడం రియల్లీ గ్రేట్ . డైరెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక ఫ్రెండ్స్ లాగా ఈ సినిమా చేశాం. మైత్రి మూవీ మేకర్స్ కొత్తవారికి అవకాశం ఇవ్వడంలో ఫస్ట్ లో ఉంటారు. అందుకే వాళ్ళు మేకర్స్ అయ్యారు వాళ్లందరికీ నేను రుణపడి ఉంటాను’అన్నారు
డిఓపి అభినందన్ మాట్లాడుతూ… అజిత్ గారితో వర్క్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. నా ఫ్రెండ్ డైరెక్టర్ అధిక్ వల్ల ఇది సాధ్యమైంది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలే ఇలాంటి సినిమాని తీయగలరు. 67 రోజులపాటు విదేశాల్లో షూట్ చేశాం. ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ మైత్రి మూవీ మేకర్స్ వల్లనే సాధ్యమవుతాయి. సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు . సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ఆడియన్స్ కి అందరికీ థాంక్యూ’అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. 18 నెలల తర్వాత మళ్లీ అజిత్ గారితో కలిసి సినిమా చేశాను. అజిత్ గారికి, డైరెక్టర్ అధిక్, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. ఇది అధిక్ తో నా మూడో సినిమా. మాది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ థాంక్యూ. సినిమా చాలా అద్భుతంగా ఆడుతోంది. మ్యాసీవ్ బ్లాక్ బస్టర్. తమిళనాడులో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేస్తుంది. తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్ల అద్భుతంగా రన్ అవుతుంది. ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ కి కి థాంక్యూ .తప్పకుండా వెళ్లి సినిమాని థియేటర్స్ లో చూడండి. గ్రేట్ మ్యాజిక్ ని ఎంజాయ్ చేయండి’అన్నారు.
యాక్టర్ సునీల్ మాట్లాడుతూ. . ముందుగా నేను డైరెక్టర్ అధిక్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయనే నా ఫస్ట్ తమిళ్ సినిమా మార్క్ ఆంటోనీ లో ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తే అది చేశాను. ఆయన టైమింగ్ తోనే యాక్ట్ చేశాను. ఈ సినిమాని ఆయన చాలా డిఫరెంట్ గా తీశారు. అజిత్ గారి సినిమాలన్నీటికి సీక్వెల్ లా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కి పర్ఫెక్ట్ డైరెక్టర్ అధిక్. ఆయన డైరెక్షన్ చాలా స్పీడ్ గా ఉంటది. ఫస్ట్ టైం తమిళ్లో సినిమా చేసి మంచి హిట్ కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ కి కంగ్రాట్స్. ఇలానే అన్ని భాషల్లో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అజిత్ సింపుల్ సిటీ హైయెస్ట్ గ్రేడ్ లో ఉన్న మనిషి అజిత్ గారు. ఆయన ఎనర్జీ అద్భుతం. ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన్ని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏరకంగా పూనకాల్లోకి వెళ్లిపోయారో ఈరోజు అజిత్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు’అన్నారు.
ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ. . అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్లీ వైరల్ అయింది. అజిత్ గారితో వర్క్ చేయడం మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఈ అవకాశం ఇచ్చిన అజిత్ గారికి, డైరెక్టర్, మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు.
తారాగణం: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్
సాంకేతిక సిబ్బంది
రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
డీవోపీ: అభినందన్ రామానుజం
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్
స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్
స్టైలిస్ట్: అను వర్ధన్ / రాజేష్ కమర్సు
పీఆర్వో : సురేష్ చంద్ర
పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
సౌండ్ డిజైన్: సురేన్
స్టిల్స్ : జి ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్స్ : ADFX స్టూడియో
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్
CEO: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, T సిరీస్
సహ నిర్మాత: శివ్ చన్నా
ప్రెసిడెంట్ (టి సిరీస్): నీరజ్ కళ్యాణ్