తెలుగు వారి జీవధార… ఆహా “గోదారి” డాక్యుమెంటరీఅద్భుతం అంటున్న ప్రేక్షక లోకం

మార్చి 30న వస్తోన్న ఆహా’ గోదారి డాక్యుమెంటరీ! –

తెలుగు ప్రేక్షకుల అదరాభిమానాలు పొందుతూ ఓటీటీ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ఆహా మరో కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తోంది. ఆహా గోదారి పేరుతో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు చూపేందుకు స్వాతి దివాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ మార్చి 30 న ప్రసారం కానుంది.

త్రింబకేశ్వర్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నది గోదారి.

ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీ విపణికి ఒక మైలురాయి నిలవనుంది. వినోద రంగంలో సంప్రదాయ వినోద కార్యక్రమలు కాకుండా, ఈ తరహా డాక్యుమెంటరీలు మరిన్ని వచ్చేందుకు ‘ఆహా గోదారి’ దోహదపడుతుందనడంలో సందేహాం లేదు. ఇలాంటివాటి వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అత్యద్భుతమైన ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది.

దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ, ఆహా ఓటీటీ ద్వారా ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించనుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించినట్టు వివరించారు. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపనున్నట్టు తెలిపారు.