ఇలా ఉంటే నిజంగానే ప్రతి రోజు పండగే…

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రతి రోజు పండగే. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తేజ్ బర్త్ డే సందర్భంగా ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశారు. ఫారిన్ బ్యాక్ డ్రాప్ నుంచి విలేజ్ వరకూ సాగిన ప్రతి రోజు పండగే వీడియో మెగా అభిమానులని ఆకట్టుకుంటుంది.

నలభై సెకండ్ల డ్యూరేషన్ తో కట్ చేసిన ఈ వీడియోలో తేజ్ చాలా సింపుల్ గా, గయ్ నెక్స్ట్ డోర్ లా ఉన్నాడు. రాశి కన్నా కనిపించింది ఒక్క షాట్ లోనే అయినా ఆకట్టుకుంది. సిటీలో తేజ్ తో రావు రమేష్ హుషారుగా కనిపించాడు. ఈ ఇద్దరు అలా కనిపించి మెరిసినా కూడా వీడియో అంతా సత్యరాజ్, తేజ్ మధ్య రిలేషన్ ని చూపించడానికే వాడారు. ప్రతి రోజు పండగే సినిమా కూడా తాతా మనవళ్ల మధ్య కథగానే కనిపించేలా ఉంది.