కరోనాను కట్టడి చేసే అవకాశం ఇవ్వండి” అంటూ ప్రముఖ దర్శకులు టి.ప్రభాకర్ చేస్తున్న విజ్ఞప్తి!!

 ఇప్పుడు మనం భయానక పరిస్థితుల్లో ఉన్నాం. ఈ ప్రమాదకరమయిన పరిస్థితుల నుండి బయట పడే మార్గం తెలియక విలవిలలాడుతున్నాం. కానీ, ఈ మహమ్మారి కరోనా వైరస్ ని  అంతం చేయడానికి, నిరాదరణకు గురైన ఒక అద్భుత శక్తి ప్రకృతి చికిత్సలో ఉంది. అదే లంకణం అంటే.. ఉపవాసం, ఫాస్టింగ్. 
 మన పూర్వికులు, ఋషులు, "లంకణం పరమ ఔషదం" అని ఏనాడో చెప్పారు. ఈ నేచర్ క్యూర్ విధానాన్ని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆచరించి ఎన్నో విషయాలను మనకు అందించారు. ఆ వారసత్వాన్ని ఇప్పుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు  గారు, ఇంకొంతమంది నేచర్ క్యూర్ డాక్టర్లు కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా నేను కూడా ఆ విధానాన్ని ఫాలో అవుతూ కొన్ని ప్రయోగాల్ని చేసి సక్సెస్ అయ్యాను.

 ఈ అనుబవాలన్నింటి వలనే ప్రతీ ఒక్కరూ వణుకుతున్న కరోన వైరస్ ని నిర్భయంగా... కావాలనే నా శరీరంలోకి రప్పించుకుని, ఉపవాసం అనే ఆయుధంతో నాలుగు రోజుల్లోనే పూర్తిగా నిర్మూలించుకున్నాను. నా భార్య కూడా నేచర్ క్యూర్ లోనే ఇంకో విధానంతో గొంతులోనె వైరస్ ని నిర్మూలించుకుంది. ఇప్పుడు ఎన్నో మార్పులు చెందుతూ మన దేశాన్నంతా అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ని కూడా నేను నా భార్య మా శరీరంలోకి ఇంకొకసారి ఎక్కించుకుని నేచర్ క్యూర్ పద్దతిలొ సంపూర్ణంగా ఎలా నిర్మూలించుకోవచ్చో నిరూపించడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. 

ఎవ్వరూ నమ్మని, ఆచరించని, మరుగున పడుతున్న అద్భుత శక్తిని బాధ్యతతో నిర్వర్తించి ఈ మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశం ఇవ్వమని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి, పూర్తి వివరాలున్న వీడియో లింక్ ను పంపించాను. అలాగే మన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారికి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి, సుప్రీం కోర్ట్ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ గారికి, హైకోర్ట్  ప్రధాన న్యాయమూర్తి గారికి,  హైకోర్ట్ లీగల్ సెల్ అథారిటీ చైర్మైన్ గారికి లెటర్స్ రాసి వీడియోని పంపించాను. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, ఇతర అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఆరోగ్యశాఖ మంత్రులకు కూడా రాశాను. ఇంకొందరికి రాస్తూనే ఉన్నాను. 

    ఎందుకంటే, ఎవ్వరి ఆదరణ లేని ఈ వైద్య విధానాన్ని అర్ధం చేసుకుని ఏ ఒక్కరైనా సహృదయం తో స్పందిస్తే తక్షణమే నేచర్ క్యూర్ పవర్ ని ఆచరణలోకి తీసుకొచ్చి ఈ ఘోరాల్ని ఆపడానికే.  ఇందుకు ఏ ఖర్చూ లేదు. నెలలు, సంవత్సరాల టైం అవసరం లేదు. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పది రోజుల్లోనె  ఫలితాలను చూడొచ్చు. ఇన్ని అద్భుతాలు ఉన్న  ఈ నేచర్ క్యూర్ శక్తి తో, అన్ని విధాలా మనల్ని విధ్వంసం చేస్తున్న కరోన మహమ్మారిని అంతం చేయడానికి నేను చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారాన్ని అందించాలని మీడియా మిత్రులందరినీ అర్ధిస్తున్నాను. 
 నా ఈ ప్రయత్నాలకు సహకరిస్తున్న జస్టిస్ చంద్ర కుమార్ గారికి, న్యాయవాది జక్కుల లక్ష్మణ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను!!

ఇట్లు
T. ప్రభాకర్
9866424254