కొమురం భీమ్ టీజర్ సన్నివేశాలను పూర్తి చేసిన RRR టీమ్.. గేట్ రెడీ

రాజమౌళి పరిమిత సిబ్బందితో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ లో కొన్ని క్రేజీ టీజర్ సన్నివేశాలు చిత్రీకరించబడతాయని మొదటి నుంచి టాక్ వస్తోంది. ఇక ఫైనల్ గా అదే జరిగింది. కరోనా వైరస్ ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా రాజమౌళి టీజర్ కి సంబంధిత సన్నివేశాలన్నింటినీ ఎన్టీఆర్ లో చిత్రీకరించారు.

ఇక టీజర్ పనులు ముగిసిన వెంటనే రాజమౌళి మరోసారి బ్రేక్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇతర తారలతో షూట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి హీరోలు ఇద్దరూ మరోసారి షూట్‌లో కలుసుకుంటారని సమాచారం. అలియా భట్, అజయ్ దేవగన్ లతో ఇంకా చాలా సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ కొమురం భీమ్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొమురం భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ని అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.