జార్జ్ రెడ్డి క్యారెక్టర్ ఒక్క పాటలో ఎలా చూపించారో చూడండి…

ట్రైలర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సినిమా జార్జ్ రెడ్డి. ఓయూ విద్యార్థి స్టూడెంట్ లీడర్, జార్జ్ రెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. కంప్లీట్ సీరియస్ సినిమాగా ప్రమోట్ అవుతుంది అనుకున్నారో ఏమో లేక జార్జ్ రెడ్డి సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అని చుపించాలనుకున్నారో ఏమో కానీ చిత్ర యూనిట్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

బులెట్ అంటూ సాగే ఈ పాటని మంగ్లీ పాడింది, 70ల్లో జరిగే కథ కాబట్టి అప్పటి పరిస్థితులకి తగ్గట్లు సాంగ్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. సీరియస్ సినిమా నుంచి వచ్చిన హుషారైన పాట ఈ బెల్లెట్ సాంగ్. లిరికల్ ప్రోమో అంటూ రిలీజ్ చేశారు కానీ ఇది వీడియో ప్రోమో సాంగ్ లాగే ఉంది. ఈ పాటతో జార్జ్ రెడ్డి గురించి తెలియని వాళ్లు కూడా జస్ట్ ఒక కొత్త సినిమా చూడడానికి వెళ్లొచ్చు అనే ఇంట్రెస్ట్ కలిగించింది.