సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి-జార్జ్ రెడ్డి…

సరిగ్గా రెండేళ్ల క్రితం తెలుగు సినిమా ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ ఒక ట్రైలర్ బయటకి వచ్చింది. మూడు నిమిషాల డ్యూరేషన్ తో వచ్చిన ఆ ట్రైలర్ చిన్న సైజ్ సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ ట్రైలర్ ఏంటి అనే కదా మీ డౌట్… అర్జున్ రెడ్డి. ఒక హీరోని స్టార్ చేసిన సినిమా ఇది, ఒక డైరెక్టర్ ని నేషనల్ రేంజుకి తీసుకెళ్లిన సినిమా అది. అర్జున్ రెడ్డి మన జనరేషన్ చుసిన ఒక కల్ట్ క్లాసిక్ సినిమా. శివ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి.

george reddy

సరిగ్గా రెండు మూడు రోజుల క్రితం అర్జున్ రెడ్డి స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ మళ్లీ ఒక ట్రైలర్ బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఆ ట్రైలర్ పేరు జార్జ్ రెడ్డి. స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ దసరా కానుకగా బయటకి వచ్చింది. బలమైన కథ ఉండడంతో ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. బహుశా అర్జున్ రెడ్డి తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ట్రైలర్ జార్జ్ రెడ్డినే అయి ఉండొచ్చు. అయితే ఒక సినిమా యాంగర్ మానేజ్మెంట్ లేని వ్యక్తి గురించి అయితే మరోకటి ఆవేశం ఆణువణువూ నిండిన ఒక వీరుడి కథ. మరి జార్జ్ రెడ్డి సినిమా అర్జున్ రెడ్డి స్థాయి హిట్ అవుతుందేమో చూడాలి.