జార్జ్ రెడ్డి నైజాం రైట్స్ సొంతం చేసుకున్న గ్లోబల్ సినిమాస్

ట్రైలర్ తో అంచనాలు పెంచిన జార్జిరెడ్డి సినిమాకు బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వస్తున్నాయి..ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ను ఇటీవలే అభిషేక్ పిక్చర్స్ – అభిషేక్ నామా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ నుండి నైజాం హక్కులను గ్లోబల్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ మంచి ప్రైజ్ ఆఫర్ చేసి దక్కించుకున్నారు. గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

george reddy

సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు. “జార్జిరెడ్డి “చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంగీతం -సురేష్ బొబ్బిలి,
ఎడిటింగ్- ప్రతాప్ కుమార్,
ఆర్ట్- గాంధీ నడికుడికార్,
కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్,
ఫైట్స్ -గణేష్, ఆర్కే,
అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.
స్టిల్స్ -వికాస్ సీగు,
సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్
పి ఆర్ వో: జిఎస్ కె మీడియా
కో డైరెక్టర్ -నరసింహారావు,
అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.
కో ప్రొడ్యూసర్:సంజయ్ రెడ్డి
నిర్మాత:అప్పిరెడ్డి
రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి