ప్రస్తుత సినిమా రంగ పరిస్థితులపై “జినీవర్స్” బల్వంత్ సింగ్ కామెంట్

వేవ్స్ సమ్మిట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమిర్ ఖాన్, షారుక్ ఖాన్… థియేటర్లు పెంచుకోకపోతే సినిమా రంగం మెల్లగా చచ్చిపోవడం ఖాయమని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. సూపర్ డూపర్ హిట్టయిన సినిమాలను సైతం మన దేశ జనాభాలో కేవలం 2 శాతం మంది మాత్రమే చూస్తున్నారనే గణాంకాలను సైతం వారు ఉదహరించారు. ప్రేక్షకులకు థియేటర్లు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని వారు పేర్కొన్నారు.

అయితే ఈ విషయం గురించి… ఎన్నో ఏళ్లుగా ఒక ఉద్యమంలా పోరాడుతున్నారు… సినిమాలే సర్వస్వంగా భావించే “జినీవర్స్” అధినేత బల్వంత్ సింగ్. వ్యాపార దృక్పథంతో కాకుండా… సినిమా రంగాన్ని బ్రతికించుకోవాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు బల్వంత్ సింగ్. నగరాలు – పట్టణాల నడిబొడ్డున ఉన్న థియేటర్లు వ్యాపార సముదాయాలుగా, కల్యాణ మండపాలుగా మారిపోతున్న తరుణంలో… జనాభా విస్తరణకు అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండేలా చిన్న థియేటర్లు నిర్మించాలని బల్వంత్ సింగ్ చెబుతున్నారు. ఇప్పటికైనా సినీరంగ పెద్దలు ఈ విషయమై శ్రద్ధ తీసుకుని కార్యాచరణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.